అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

357

The bullet news ( అనంతపురం ) :-  అనంతపురం జిల్లాలోని బీటీపీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. జిల్లాను కరువు రహితంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పలు శంకుస్థాపనలు చేయనున్నారు. కృష్ణా జలాలను అనంతపురంకి తరలించడంలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి పనులనకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు కందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌కు కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు..

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు పుట్టపర్తి సత్యసాయి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో గుమ్మగట్ట మండలం బైరవాని తిప్ప ప్రాజెక్టుకు చేరుకుంటారు. 960 కోట్ల రూపాయల వ్యయంతో.. కృష్ణా జలలాలను జీడిపల్లి రిజర్వాయర నుంచి బైరవాని తిప్ప ప్రాజెక్టుకు తరలించేందుకు నిర్మిస్తున్న కాలువ పనులకు శంకుస్దాపన చేయనున్నారు.

ముందుగా బైరవాని తిప్పకు చేరుకున్న తరువాత పైలాన్ ప్రారంభిస్తారు. తరువాత దేశంలో మరెక్కడా తవ్వని విధంగా లక్ష పారం పాండ్లను తవ్విన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. బైరవాని తిప్ప ప్రాజెక్టును సందర్శించిన తరువాత.. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కళ్యాణదుర్గం మండలం గరుడాపురం చేరుకుని 3 గంటలకు కాలువల పనులకు భూమి పూజ చేస్తారు.. తరువాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.. తరువాత సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, పరికరాలను పంపిణీ చేస్తారు.

ముఖ్యమంత్రి రాక సందర్బంగా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు గట్టి బంధోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా పర్యటన ముగించుకుని.. పుట్టపర్తికి చేరుకుని.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరుతారు