అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిలా తీర్చిదిద్దుతాము – చంద్రబాబు.

99

THE BULLET NEWS (NAIDUPETA)-ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నదులను పూర్తిగా అనుసంధానం చేసి… అమరావతి సిటీని పూర్తి చేసి ప్రజామోదం సాధిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… నెల్లూరు జిల్లాలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మరోసారి కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు… కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని ఆరోపించిన ఆయన… అడుగడుగునా ఇబ్బందులు పెట్టినా 55 శాతం పోలీవరం పనులు పూర్తి చేశాం… 2019కి పోలవరం పూర్తిచేసి చూపిస్తామన్నారు.

గోదావరి – కృష్ణ అనుసంధానం చేసినట్టే… గోదావరి – పెన్నా అనుసంధానం కావాలన్నారు సీఎం చంద్రబాబు… అమరావతి, పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజలకు చాలా ముఖ్యమైనవి అన్నారు. దేశంలో అందరికంటే అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పోతున్నామంటే ప్రభుత్వ యంత్రాగ సహకారం మరువలేనిదని ప్రశంసించిన ఏపీ సీఎం… అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నా దేశంలో ఎవరు సాధించని అభివృద్ధి సాధించామంటే ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 18 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉన్నామని… నీటి వినియోగంలో మెలకువలు అనుసరిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నామని ప్రకటించారు చంద్రబాబు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడపాటమే తమ ముందున్న ధ్యేయమన్నారు. 2004లో మిగుల కరెంటు ఉన్న రాష్ట్రాన్ని… 2014కి కరెంటు లోటు ఏర్పడితే… తమ ప్రభుత్వమే మళ్లీ మిగులు కరెంటు సాధించామని స్పష్టం చేసిన చంద్రబాబు… పల్లెల నుండి పట్టణాలకు… పట్టణాల నుండి రాజధానికి రోడ్డు రవాణ సౌకర్యాలు కల్పించి తీరుతామని వెల్లడించారు.

SHARE