వినాయక చవితి స్పెషల్…బిజీ బిజీగా భక్తులు…

94

THE BULLET NEWS :-వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమైంది… నేటి నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేడు ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రి అమరనాథ్ రెడ్డి. ఇక సత్యప్రమాణాలకు నిలయమైన, దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారికి ప్రతీ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు పరిశీలించినట్లయితే ఈ రోజు వినాయకచవితి ద్వజారోహాణం ఉంటుంది… రేపు హంస వాహానంపై ఊరేగనున్న గణపతి… 15న నెమలి వాహానం, 16న మూషిక వాహానంచ 17న శేష వాహానం, 18న వృషభ వాహానం, 19న గజ వాహానం, 20న రథోత్సవం, 21న అశ్వవాహానంచ 22న ధ్వజ అవరోహహాణం, 23న అధికార నంది వాహానం, 24న రావణ బ్రహ్మ వాహానం, 25న యాళి వాహానం, 26న సూర్యప్రభ వాహనం, 27న చంద్ర ప్రభ వాహనం, 28న విమానోత్సవం, 29న పుష్ప పల్లకీ సేవ, 30న కామదేను వాహనం, అక్టోబర్‌ 1న కల్పవృక్ష వాహనం, అక్టోబర్‌ 2న పూలంగి సేవ, అక్టోబర్‌ 3న తెప్పోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

ప్రపంచ గుర్తింపు పొందిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది శ్రీ సప్త ముఖ కాళసర్ప మహాగణపతిగా భక్తులకు దర్శనమీయనున్నారు. గణేశ్ ఉత్సవాలు మొదలుపెట్టి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 60 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రూపొందించిన నిర్వాహకులు.. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.

గతేడాది కంటే ఈసారి విగ్రహం ఒక్క అడుగు ఎత్తు తగ్గించి.. 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పుతో రూపొందించారు.7 తలలు, 14 చేతులు, తలలపై సర్పాలతో అలంకరించారు.సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌ శర్మ సూచనల మేరకు విగ్రహంలో ప్రతిదీ 7 వచ్చేలా ఏర్పాటు చేశారు.
7 ఏనుగులు నమస్కరిస్తున్నట్లు పక్కనే ఏర్పాటు చేశారు.వినాయకుడికి 14 చేతులు ఉన్నాయి. కుడివైపు గల 7 చేతుల్లో అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఆశీర్వాదం రూపంలో చక్కగా అమర్చారు.ఎడమ వైపు ఏడు చేతుల్లో పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లు, గడియం, లడ్డు ఉన్నాయి.
కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తులో ఉన్నాయి.
గణేశుడి కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం నిర్మించగా ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.
విగ్రహం కోసం నిర్మించిన షెడ్డును ఆదిలాబాద్‌కు చెందిన 20 మంది బృందం నిర్మించింది.
మచిలీపట్నానికి చెందిన బృందం వెల్డింగ్‌ పనులు చేసింది.విగ్రహ నిర్మాణంలో ఉపయోగించినవి.. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, మట్టి, ఇనుము, గన్నీ వస్త్రం, కొబ్బరి పీచు, వాటర్‌ పెయింట్స్‌.

SHARE