చంద్రబాబుకు ఐటీ సెక్టార్‌పై ఎంతో ప్రేమ – మంత్రి లోకేష్.

111

THE BULLET NEWS (NAIDUPETA)-ఐటీని ఆయనకంటే ఎవరూ బాగావాడలేరు..అందుకే ఆయన ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న సమయంలోనూ హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలను తేవడానికి ఎంతో కృషి చేశారు… ఇక ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తనకు చంద్రబాబు కేబినెట్‌లో చేరిన తర్వాత ఐటీని ఆయనకంటే ఎవరూ బాగావాడలేరని విషయం తెలిసిందన్నారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్… నెల్లూరులో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.

24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి నారా లోకేష్… 2014కి ముందు ఉన్న కరెంటు కోతలను అదిగమించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 24 గంటలు కరెంటు ఇస్తున్నారని… లోటు బడ్జట్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఏపీలో మిగులు బడ్జెట్ లేదు… లోటు బడ్జెట్ ఉంది… ఇప్పుడిప్పుడే లోటు బట్జెట్ నుంచి బయట పడుతున్నామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్… చిన్న వయసులోనే కీలకమైన శాఖలకు మంత్రిని అయినందుకు సంతోషపడుతున్నానని పేర్కొన్న ఆయన… 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో… 2029 నాటికి దేశంలో అగ్ర స్థానంలో ఏపీ ఉంటుందన్నారు.

SHARE