పచ్చ మాఫియా చంద్రబాబును అల్లూరి సీతారామరాజుగా ప్రొజెక్ట్‌ చేస్తోంది. – భూమన కరుణాకర్ రెడ్డి.

114

THE BULLET NEWS (TIRUPATI):-

◆దమ్ముంటే ఓటుకు కోట్లు కేసును ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధపడాలి…

◆చంద్రబాబుపై పెట్టింది ఓ చెత్త కేసు..

◆చింతమనేని రోజూ అవినీతికి పాల్పడుతున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.

◆ఆయనది వీరోచిత పోరాటంగా చిత్రీకరిస్తున్నారు.

◆పీఎం అయినా, సీఎం అయినా కోర్టు వాయిదాలకు హాజరుకాకపోతే నాన్‌బెయిల్‌బుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం సర్వ సాధారణం.

నాన్ బెయిల్‌ నోటీసు కోర్టు ఇస్తే… వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కుట్రలు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అంటూ… న్యాయవ్యవస్థను కించపరచాలా మాట్లాడుతున్నారు… ఆయన మాటలను సుమోటోగా కోర్టు పరిగణించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి… ఓటుకు నోటుకు కేసులో సీబీఐ విచారణ వేయాలని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా? అంటూ ప్రశ్నించిన ఆయన… బాబ్లీ ప్రాజెక్టు కేసు సంబంధించి నాన్ బెయిల్ బుల్ వారెంట్ వస్తే ఎదో కుట్ర జరిగిపోతోందని టీడీపీ నేతలు డ్రామాలు ప్రారంభించారని… ఆ కేసును చూస్తే చంద్రబాబుకు శిక్ష కూడ పడని చెత్తకేసు అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే పెట్టిన కేసుకు చంద్రబాబు మీదా పెట్టిన కేసుకు తేడా లేదన్న కరుణాకర్ రెడ్డి… నాలుగేళ్లులో ఎన్నో అక్రమ కేసులను వైసీపీ నేతలపై పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి ఆంజనేయుని తోక అంతా పెద్దదిగా పోల్చిన భూమన… పుష్కరాల ఘటన, ఓటుకు నోటు, పోలవరం, పట్టిసీమ అక్రమాలు జరిగిన చంద్రబాబుపై ఒక్క కేసు లేదన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసమే ఓ చెత్త కేసును చంద్రబాబు తెరపైకి తెచ్చారని విమర్శించిన వైసీపీ నేత… దానికి టీడీపీ నేతలు బజన చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో ఉన్న ఓటర్లుకంటే ఎక్కువగా చంద్రబాబుపై కేసులు ఉంటాయంటూ సెటైర్లు వేశారాయన.

SHARE