వైసీపీలోకి ఆనం ఫ్యామిలీ???

232

THE BULLET NEWS (NELLORE)-తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలే అవకావం ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి టిడిపి నుంచి తప్పుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరవచ్చని సమాచారం వస్తోంది. ఇప్పటికే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరితో చర్చలు జరియాని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ,ఆయన రావడానికి ముందుగానే రామనారాయణ అక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకున్నారని చెబుతున్నారు.అంతేకాకా తాజాగా నెల్లూరులోని తన ఆఫీస్ నుంచి చంద్రబాబు పోటో కూడా తొలగించారని వార్తలు వస్తున్నాయి.దీంతో రామనారాయణ రెడ్డి పార్టీని వీడడం ఖాయమని అంటున్నారు.ఆయన వెంకటగిరి సీటు కావాలని అడుగుతున్నారని ఆ వార్తలు సూచిస్తున్నాయి. గత ఏడాది టిడిపిలో చేరిన తర్వాత ఆనం సోదరులకు అన్ని అవమానాలు ఎదురయ్యాయని అంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ మారుతున్నారన్న వార్తలు రావడంతో ఆయనను బుజ్జగించడానికి టిడిపి నాయకత్వం ప్రయత్నిస్తోందని ,అయినా అందుకు రామనారాయణ సుముఖంగా లేరని అంటున్నారు. వైసీపీలో చేరి వెంకటగిరి సీట్ అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆత్మకూరు సీట్ ఇచ్చేందుకు వైసీపీ ఫేవర్ గా ఉన్నట్లు తెలుస్తోంది

SHARE