THE BULLET NEWS (NELLORE)- నెల్లూరు జిల్లాతోపాటూ ప్ర‌కాశం, చిత్తూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందిస్తూ, వైద్య‌రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న నెల్లూరు అపోలో స్పెషాలిటీ వైద్య‌శాల‌లో మ‌రో అరుదైన, క్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా టిపి గూడూరు మండ‌లం సౌత్ ఆమ‌లూరుకు చెందిన గాలి సుబ్బ‌మ్మ‌కు 103 సంవ‌త్స‌రాలు. 103ఏళ్ల వ‌య‌స్సులో ఆమెకు తుంటి ఎముక విరిగింది. దీంతో ఆమె న‌డ‌వ‌లేని స్థితికి చేరుకోవ‌డంతోపాటూ విప‌రీత‌మైన నొప్పితో బాధ‌ప‌డుతుండేది. దీనిని గ‌మ‌నించిన కుటుంస‌భ్యులు, చెన్నై, హైద‌రాబాద్ వంటి మ‌హానగరాల్లో ప‌లు ప్ర‌ముఖ హాస్పిట‌ళ్ల‌కు వెళ్లినా ఫ‌లితం లేక‌పోయింది. ట్రోకాంటిక్ బోన్‌కు ఆప‌రేష‌న్ చేయాల్సి రావ‌డంతో ఎంతో మంది వైద్యులు, 103ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న సుబ్బ‌మ్మ‌కు అన‌స్థిషియా ఇచ్చి ఆప‌రేష‌న్ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని, ఇది త‌మ‌కు సాధ్యంకాద‌ని తెలిపారు. చివ‌రి ప్ర‌య‌త్నంగా సుబ్బ‌మ్మ‌ను వారు కుటుంబ‌స‌భ్యులు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌కు తీసుకువ‌చ్చారు. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వివేకానంద‌రెడ్డి, ఎంతో క్లిష్ట‌మైన ఈ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా ముగించారు. అన‌స్థిషియా డాక్ట‌ర్ ఎమ్‌.వి.ఎస్‌. చైత‌న్య స‌హ‌కారంతో సుబ్బ‌మ్మ‌కు తుంటి ఎముక‌ను స‌రి చేశారు. ప్ర‌స్తుతం 103 సంవ‌త్స‌రాల వృద్ధురాలు సుబ్బ‌మ్మ ఎంతో ఆరోగ్యంగా, చిరున‌వ్వుతో అంద‌రినీ ప‌ల‌క‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వివేకానంద‌రెడ్డి మాట్లాడుతూ వ‌య‌స్సుపైబ‌డిన వారిలో హిప్ ఆప‌రేష‌న్‌లు చేయ‌డం కొంత క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని తెలిపారు. అయితే 103 సంవ‌త్స‌రాల వ‌య‌స్సుగ‌ల సుబ్బ‌మ్మ‌కు ఎంతో క్లిష్ట‌మైన హిప్ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 2017 19వ తేదిన సుబ్బ‌కు ఆప‌రేష‌న్ చేసిన‌ట్లు తెలిపారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం చాలా బాగుంద‌ని, అంద‌రితో మాట్లాడ‌టంతోపాటూ న‌డ‌వ‌గలుగుతున్నార‌ని తెలిపారు. మ‌హాన‌గ‌రాల‌కు ధీటైన వైద్య‌సేవ‌లు అందించ‌డంతో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ ముందుంద‌ని, నిపుణులైన వైద్య‌బృందం, అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, వ్యాధిగ్ర‌స్తుల‌ను కంటికిరెప్ప‌లా చూసుకునే వైద్య సిబ్బంది నెల్లూరు అపోలో హాస్పిట‌ల్ సొంత మంది వివ‌రించారు. క్లిష్ట‌మైన ఆప‌రేష‌న్‌ల‌ను ఎంతో సులువుగా, విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ వైద్యుల‌ను అందెవేసిన చేయి అని తెలిపారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్లో మోకాళ్లు మ‌రియు భుజ‌ముల‌కు సంబంధించి ఆర్కో స్కోపిక్ విధానాల ద్వారా లిగ‌మెంట్‌, మోనిస్క‌స్‌, మ‌రియు రొటేటార్ క‌ఫ్ టెడాన్ రిపూర్ స‌ర్జ‌ర్జీలు విజ‌య‌వంతం నిర్వ‌హిస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిట‌ల్ అందిస్తున్న సేవ‌ల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

SHARE