వైసీపీలోకి మరో కీలక నేత..?

108

The bullet news (Anathapuram)-వచ్చే సంవత్సరం మార్చి నెలలో అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తుంది.. మధుసూదన్ గుప్తా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక పర్యాయం గుత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.. ఈయన ఎంపీ జేసీ దివాకరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకొంటారు.. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకోసం ఉద్యమాలు చేసిన నాయకుల్లో మధుసూదన్ గుప్తా కూడా ఉన్నారు.. కాగా రాష్ట్రంవిడిపోయాక వీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు.. కానీ తన రాజకీయ గురువు జేసీ దివాకరరెడ్డి టీడీపీలో కొనసాగుతుండగా అయన మాత్రం ఇప్పటివరకు ఎ పార్టీలో చేరకపోవడం గమనార్హం..

వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రజాసమస్యలు నేరుగా ప్రజల వద్దకే వచ్చి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్షనేత హోదాలో అయన రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. అందులో బాగానే మొన్నటివరకు కడప, కర్నూల్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నిన్న అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గం బసినేపల్లిలో అడుగుపెట్టిన జగన్ కు మధుసూదన్ గుప్తా పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.. మధుసూదన్ గుప్తా త్వరలో పార్టీలో చేరుతున్నారు గనుకనే నిన్న జగన్ ను కలిసి స్వాగతం పలికారని రాజకీయవాఙర్గాల్లో చర్చ నడుస్తుంది.. మరి గుప్తా వైసీపీలో చేరే నిర్ణయం తీసుకుంటారో.. లేక జగన్ ను వైయస్ కుమారుడిగానే గుర్తించారో చూడాలంటె మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..

SHARE