మరో మైలురాయి దాటిన వైఎస్ జగన్

22

The bullet news (Prakasam)-  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 104వ రోజు ముగిసింది. ఇవాళ ఉదయం అద్దంకి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదుగా తక్కెళ్లపాడు చేరుకుని యాత్రను ముగించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ 1400 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఇవాళ్టి పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 16.3 కిలోమీటర్లు నడిచారు. స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు జగన్. మంగళవారం రోజున యాత్ర 105వ రోజు తక్కెళ్లపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించి… జె. పంగులూరు, అరికట్ల వారిపాలెం, గంగవరం మీదుగా ఇంకొల్లులో ముగించనున్నారు వైఎస్ జగన్.

SHARE