అపోలోలో మ‌రో అరుదైన హార్ట్ స‌ర్జ‌రీ

94

The bullet news (Nellore)-  వైద్య‌రంగ‌లో నూత‌న ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుడుతూ, అత్యాధునిక వైద్య టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటూ, క‌ష్ట‌త‌ర‌మైన ప్రొసిడ‌ర్స్‌ను కూడా చాలా సులువుగా విజ‌య‌వంతం చేస్తూ, ఎంతో మంది ప్రాణాల‌ను నిల‌బెడుతున్న నెల్లూరు అపోలో స్పెషాలిటీ వైద్యులు, మ‌రో అరుదైన‌,అతి క్లిష్ట‌మైన ప్రొసిడ‌ర్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఈసంద‌ర్భంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ విజ‌య్ అమ‌ర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ 59 సంవ‌త్స‌రాలు క‌లిగిన రామ్మూర్తి అనే వ్య‌క్తి షుగ‌ర్‌, బిపితోపాటూ, గుండె సంబంధిత వ్యాధి కూడా ఉంద‌ని తెలిపారు. ఇత‌నికి 2008లో గుండె నొప్పి రావ‌డంతో స్టంట్ వేయించుకున్నార‌ని, ఆ త‌రువాత 2010లో గుండెకు బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ని తెలిపారు. అయితే తాజాగా మ‌రోసారి గుండె పోటు రావ‌డంతో నెల్లూరు అపోలో హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని, ఆయ‌న‌కు యాంజియోగ్రామ్ చేయ‌గా, గుండె కుడివైపు ర‌క్త‌నాళానికి సంబంధించిన బైపాస్ గ్రాఫ్ట్ ప‌ని చేయడం లేద‌ని గుర్తించిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా గ‌తంలో వేసిన స్టంట్‌కు పొర‌లు వ‌చ్చిన‌ట్లు కూడా గ‌మ‌నించామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో రామ్మూర్తికి క్యాథ్ ల్యాబ్‌లో బెలూన్‌ ద్వారా ఆంజియో ప్లాస్టి చేశామ‌న్నారు. ఇందుకోసం స్టంట్ బూస్ట్ టెక్నాల‌జీతోపాటూ, క‌టింగ్ బెలూన్ వంటి అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించిన‌ట్లుప్ర‌ముఖ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ విజ‌య్ అమ‌ర్‌నాథ్ రెడ్డి వెల్ల‌డించారు. సాధార‌ణంగా గుండెకు సంబంధించిన ఆప‌రేష‌న్‌ల‌ను రెండు సార్లుకంటే ఎక్కువ‌గా చేయ‌డం చాలా అరుదుగా ఉంటుంద‌ని, అందులో రామ్మూర్తికి గ‌తంలోఒక సారి స్టంట్ వేశార‌ని, మ‌రోసారి బైపాస్ స‌ర్జ‌రీ కూడా చేసి ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలో అతనికి మ‌రోసారి ఆప‌రేష‌న్ చేసి, స్టంట్ అమ‌ర్చ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని తెలిపారు. ఈ కేసును తాము ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతం చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం రామ్మూర్తి ప‌రిస్థితి చాలా మెరుగుగా ఉంద‌ని, అపోలో హాస్పిట‌ల్ ఉన్న అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, నిపుణులైన వైద్య బృందం కార‌ణంగానే ఈ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతం చేయ‌గ‌లిగిన‌ట్లు డాక్ట‌ర్ విజ‌య్ అమ‌ర్‌నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా క‌ష్టత‌ర‌మైన ఈ ఆప‌రేష‌న్‌ను రూపాయి ఖ‌ర్చులేకుండా, ఉచితంగా చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఎంత‌టి క్లిష్ట‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌నైనా, సులువుగా ప‌రిష్క‌రించ‌డం నెల్లూరు అపోలో హాస్పిట‌ల్ వైద్యుల‌కు సాధ్య‌మ‌ని, ఈ అవ‌కాశాన్ని నెల్లూరీయులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.ఈ విలేక‌ర్ల స‌మావేశంలో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట్ మెడిక‌ల్ సూప‌రిండెంట్ డాక్ట‌ర్ శ్వేతారెడ్డి, అన‌స్థిషియా డాక్ట‌ర్లు చైత‌న్య‌, శివ‌, అపోలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు

SHARE