రోడ్లు నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు విడుదల చేసిన లోకేష్ కి కృతజ్ఞతలు – మంత్రి సోమిరెడ్డి.

56

THE BULLET NEWS (MUTHUKUR)-వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో పర్యటించారు.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.. రూ.1.20 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అనంతరం రూ. 3 కోట్ల నిధులతో 200 ఎన్టీఆర్ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి నూతనంగా మంజూరైన 336 పింఛన్ల పంపిణీ చేశారు.. మంత్రి మాట్లాడుతూ
సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణానికి 20 పనులకు గాను రూ.14.72 కోట్లు మంజూరయ్యాయన్నారు..
అడిగిన వెంటనే నిధుల మంజూరుకు సహకరించిన పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ కి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.. ప్రతి నిరుపేదకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు..

SHARE