ఏపీ లో నామినెటెడ్ పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు.

111

THE BULLET NEWS (VIJAYAWADA)- ఏపీలో పలు నామినెటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. టీటీడీ సహా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కాగా చాలా వరకు ముందు అనుకున్న వారినే పదవులు వరించగా.. మరికొందరికి ఆఖరి క్షణంలో అదృష్టం వరించింది. అయితే ఆశావహులకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది. టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్య, ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌రావు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నల్లారి కిషోర్‌ కుమార్‌లను నియమించారు. ఇక మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా జియావుద్దీన్‌, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హిదాయత్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నామన రాంబాబు, శాప్‌ చైర్మన్‌గా పి. అంకమ్మ చౌదరి, కనీస వేతన బోర్డు చైర్మన్‌గా రఘుపతుల రామ్మోహన్‌రావు, గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా దాసరి రాజారావు, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా డా. దివి శివరాం, గొర్రెల పెంపకాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వై.నాగేశ్వరరావు యాదవ్‌లను నియమించారు.

SHARE