జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేస్తాం.- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

114

THE BULLET NEWS (AMARAVATHI)-పార్లమెంటు జరిగేటప్పుడు ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని, తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు. ఆర్థిక బిల్లులు హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా పడవచ్చని, ఆర్థిక బిల్లులపై జరిగే చర్చలో ప్రత్యేక హోదా, ఆర్థికలోటుపై చర్చించాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.

SHARE