ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్…

81

THE BULLET NEWS (VIJAYAWADA)-టిడిపి ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆందోళనలు నిర్మాణాత్మకంగా ఉండాలని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. ప్రజల తరపునే ప్రతినిధులు నిలబడాలని, ప్రజల గొంతు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలన్నారు. ఐదు కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యం కాదని, అభివృద్ధి ఆగిపోరాదని..హక్కులలో రాజీలేదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకొంటూ పోవాలని సూచించారు. ఆనాడు సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలన్నారు.

 

SHARE