వీఆర్ఏల వేతనాలు పెంపు…

115

THE BULLET NEWS (AMARAVATHI)-ఆంధ్రప్రదేశ్ లోని వీఆర్ఏలకు వేతనాలు పెంచామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. జీవో నెంబరు 303 కింద వీఆర్‌ఏలకు వేతనాలు పెంచామని, ఈనెల 2 నుంచే అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ కంటే ఏపీలోనే వీఆర్‌ఏలకు ఎక్కువ జీతాలు పెంచామని స్పష్టం చేశారు. ఇప్పుడు వారి గౌరవ వేతనం రూ.10,500 గా ఉందని, అంతకు ముందు రూ.6,000గా ఉండేదని అన్నారు. అలాగే, టీఏ రూ.20 నుంచి రూ.100కి, డీఏ రూ.100 నుంచి రూ.300కి పెంచామని వెల్లడించారు. ఈ జీవోతో 26 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారని కేఈ కృష్ణమూర్తి వివరించారు.   

SHARE