ఏపీలో డిఎస్సి కి గ్రీన్ సిగ్నల్…

152

THE BULLET NEWS-సాంకేతిక సమస్యల్లో చిక్కుకున్న డీఎస్సీపై సందిగ్ధతను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని తీర్మానించింది. అంతకంటే ముందుగానే… మరోసారి ‘టెట్‌’ కూడా నిర్వహిస్తారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌తో సమావేశమయ్యారు. డీఎస్సీ నిర్వహణపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న మేరకు నియామకాలు చేపట్టాలని తెలిపారు. భేటీ అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడారు.

 

‘‘ఆగస్టులో డీఎస్సీ నిర్వహిస్తాం. పదివేలకుపైగా టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఇందుకు సంబంధించిన షెడ్యూలును కూడా మంగళవారమే ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఎట్టి పరిస్థితిలో ఆగస్టులోగా డీఎస్సీ-2018 పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అలాగే… టెట్‌ నోటిఫికేషన్‌ మే 4న విడుదల చేస్తామని, జూన్‌ 10 నుంచి టెట్‌ నిర్వహిస్తామని చెప్పారు.

SHARE