కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మళ్లీ మొండి చెయ్యి…

65

THE BULLET NEWS (NEW DELHI)-కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి మళ్లీ మొండి చెయ్యి చూపించారు. నవ్యాంధ్ర ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ కేటాయిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ఏమైందంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించకపోవడంపై తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాల పేర్లు ప్రస్తావించని అరుణ్ జైట్లీ.. బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం. అన్ని రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఉచిత వైఫై సేవలు అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పడం విశేషం.

SHARE