కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానపరిచింది-కె.ఎస్.జవహర్

74

THE BULLET NEWS (KOVVUR)-అంబేద్కర్ మహిళల సమాన హక్కుల కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేశారు.కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అనగదొక్కేందుకు ప్రయత్నించారు.అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు ను కాంగ్రెస్ పార్టీ ఓడించి అంబేద్కర్ ను అవమానించారు.

పార్లమెంటుకు పోటీ చేసిన అంబేద్కర్ను ఓడించే వరకూ నిద్రపోలేదు కాంగ్రెస్ పార్టీ .

టీడీపి ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్నీ ఎస్సి కాలనీలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. ఎస్. జవహర్ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి, పెద్దేవం గ్రామాల్లో దళిత తేజం-తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ప్రధానంగా ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా గడిచిన మూడు ఏళ్ల లో రూ.28,941 కోట్లు కేటాయెంచటం జరిగిందన్నారు.అదేవిధంగా ఎస్సి కార్పొరేషన్ ద్వారా రూ.2034 కోట్లతో వివిధ రకాల యూనిట్ల కు రుణాలు మంజూరు చేశామని తెలిపారు.75 వేలమంది విద్యార్థులకు ఐటీ, నైపుణ్యం శిక్షణ ఇచ్చామని వివరించారు.

SHARE