కంపచెట్లు.. ముళ్ళపొదలు దాటుకుంటూ….

115

THE BULLET NEWS(SARVEPALLI)-

మంత్రి అనగానే ఏసీ గదుల్లో అధికారులతో సమీక్షలు.. సమావేశాలు.. ప్రజలతో పెద్దగా సంబంధాలు ఉండవు అంటారు.. కానీ ఆ మంత్రి మాత్రం మండుటెండలో రైతులతో తిరుగుతున్నారు.. కంచెలు, కాలువలు దాటుతూ క్షేత్ర స్తాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసు కుంటున్నారు.. సాగునీరు అందుతున్నాయా లేదా అంటూ పొలాల చుట్టూ తిరుగుతున్నారు.. వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి సాయం కావాలన్నా తనని నేరుగా కలవాలంటూ కోరుతున్నారు.. ఆయన ఎవరు అనుకుంటున్నారా..? అయితే ఓసారి ఇటు లుక్కేయండి..

సర్వేపల్లి నియోజకవర్గంలో ఇవాళ మంత్రి సోమిరెడ్డి పర్యటించారు.. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన
పొదలకూరు మండలం మొగళ్లూరు పొలాల్లోకి రైతులతో కలిసి వెళ్లారు.. చెట్లు, పుట్టలు, ముళ్ల కంచెలు, కాలువలూ దాటుకుంటూ మోటార్ లను పరిశీలించారు..
మోటారు వేయకుండానే నీళ్లు వస్తున్న బోర్లను పరిశీలించిన ఆయన జిల్లాలో ఒక్క సేంట్ భూమి కూడా ఎండనివ్వ కుండా సాగు నీరు అందించామన్నారు.. గతంలో నీళ్లు లేక వెలవెలబోయిన బోర్లలో ఇప్పుడు నీరు పుష్కలంగా ఉన్నాయన్నారు.. కండలేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహం కారణంగా భూగర్భ జలమట్టాలు పెరిగి మోటారు వేయకుండానే నీళ్లు వస్తున్నాయన్నారు.. భూగర్భజలాలు పెరగడం, మోటార్ వెయ్యకుండా నీరు రావడాన్ని చూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.. రైతుల కళ్ళలో ఆనందం చూడటం కోసం కండలేరు ఎడమ కాలువ పనులు శరవేగంగా పూర్తి చేపించానన్నారు. కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని… రైతులు పచ్చగా ఉండటం ఇష్టం లేని వారే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. రైతులకు కష్టమొస్తే అర్ధరాత్రి కూడా స్పందిస్తానన్నారు..

SHARE