విజయసాయిరెడ్డిని అనాల్సిన వ్యాఖ్యలు రమణదీక్షితులను అన్నాను క్షమించండి.. -సోమిరెడ్డి.

181

THE BULLET NEWS (VIJAYAWADA)-తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుకు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఇవాళ విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ రమణదీక్షితులుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అన్నారు. రమణదీక్షితులను జైల్లో పెడితే నిజాలు బయటపడతాయంటూ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో.. నష్టనివారణ చర్యలకు సోమిరెడ్డి దిగారు.  బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉండాలని కోరుకునే వ్యక్తినని అన్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డిని అనాల్సిన వ్యాఖ్యలు రమణదీక్షితులను అన్నానని వివరణ ఇచ్చారు. చంద్రబాబునాయుడు ఇంట్లో వేంకటేశ్వరుడి నగలున్నాయన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని సోమిరెడ్డి అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ లేదా మరో రాష్ట్రంలో చేస్తే విజయసాయిరెడ్డిని లోపల వేసేవాళ్లని అన్నారు.

SHARE