ఏపీకి పాలకులకు ప్రత్యేకహోదాపై సరైన అవగాహన లేదు-సుమన్

113

THE BULLET NEWS (NELLORE)-ఏపీకి పాలకులకు ప్రత్యేకహోదాపై సరైన అవగాహన లేదని సినీ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు.. నెల్లూరులోని సింహపురి సంస్క్రుతి, సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పురస్కరాల అవార్డు అందుకునేందుకు నెల్లూరొచ్చిన ఆయన టౌన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం సినీ రంగం ఎప్పుడూ ముందుంటుందన్నారు.. తెలంగాణాలో కేసీయార్ పాలన బేష్ అన్న ఆయన దేవుడి దయ ఉంటే వచ్చే ఎన్నికల్లో ఫోటీ చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.. అనంతరం ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.. సింహపురి సంస్క్రుతి, సమాఖ్య ఆర్గనైజర్ రాంజీ ఉగాది పురస్కారాలు పేరటి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.. రాంజీ చేసే ఇలాంటి కార్యక్రమాలకు తానెప్పుడూ అండగా ఉంటానన్నారు..

SHARE