క్రీడ‌ల్లో త‌గిన గుర్తింపు తీసుకురావాలి

96

The bullet news (Venkatagiri)-  ప‌ట్ట‌ణాభివృద్ది కోసం క్ష‌ణం తీరిక లేకుండా బిజిబిజిగా గ‌డిపే ఆమె ఆ ప‌నుల్ని కాస్త‌ ప‌క్క‌న పెట్టారు.. క్రీడాకారులతో క‌లిసి బ్యాట్ ప‌ట్టారు.. వారితో కాసేపు ష‌టిల్ ఆడారు.. వారిలో ఉత్సాహాన్ని నింపారు.. ఇంత‌కీ ఎవ‌రామె అనుకుంటున్నారా..? అయితే దీనికి పై ఓ లుక్కెయ్యండి

వెంకటగిరిలోని 5వ వార్డులో కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైన‌ ఇండోర్ షటిల్ డ‌బుల్ టోర్న‌మెంట్ కు వెంక‌ట‌గిరి మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడ‌ల‌ను ప్రారంభించారు.. అనంత‌రం కాసేపు క్రీడాకారుల‌తో క‌లిసి బ్యాట్ ప‌ట్టి కోర్టులోకి దిగారు.. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆమె వారికి స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌సంగం చేశారు.. క్రీడ‌ల‌ను స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడాల‌న్నారు.. రాజ‌కీయాలు, పోలేర‌మ్మ జాత‌ర వ‌ల్ల రాష్ట స్థాయిలో గుర్తింపు పొందిన‌ వెంక‌ట‌గిరికి క్రీడల్లో కూడా గుర్తింపు తీసుకురావాల‌న్నారు.. డ‌బుల్ ష‌టిల్ టోర్న‌మెంట్ ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో 9వ బెటాలియ‌న్ అధికారి, ప‌లువురు కౌన్సిల‌ర్లు పాల్గొన్నారు…

SHARE