The bullet news :- యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ అరవింద సమేత వీరరాఘవ. ఈ క్రేజీ మూవీ ఆక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. అయితే ఒకరోజు ముందే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు వేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. నందమూరి అభిమానులతో పాటు, కామన్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. నాన్ హాలీడే రోజున రిలీజ్ చేస్తున్నా తొలిరోజు రికార్డ్ స్థాయి వసూళ్లు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి యుబైఎ సర్టిఫికేట్ దక్కింది.

అరవిందసమేత వీరరాఘవ.. భారీ హైప్ ఉన్న కారణంగా, సినిమాకి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో ఎక్కువ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు. అందుకు తగ్గట్లే…నిర్మాత రాధాకృష్ణ, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

అరవిందసమేత చిత్రాన్ని హారికా హాసినీ బ్యానర్లో రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించారు. త్రివిక్రమ్ టేకింగే హైలైట్ గా వస్తోంది ఈ సినిమా. తమన్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ హైలైట్. పూజా హెగ్డే గ్లామర్ తోనే కాక, ఈ సారి యాక్టింగ్ తో మెప్పించబోతుంది. జగపతి బాబు, నవీన్ చంద్ర నెగిటివ్ రోల్స్ లో అదరగొట్టారని తెలుస్తోంది. ఆల్ రెడీ రిలీజైన ధియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీకి వంద కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

SHARE