రౌడీ ఎమ్మెల్యేను అరెస్టు చేయండి – సీఎంకు లేఖ‌

353

The Bullet News – (Political)-  తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.. రాష్ట్రంలో చట్టం ఉందా? లేదా? ప్రజాస్వామ్యం కోసం దేశమంతా తిరిగే చంద్రబాబుకి చింతమనేని ఆగడాలు కనపడడంలేదా? అని ప్రశ్నించిన ఆయన… ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసి రెండు నెలలు కావస్తున్నా ప్రభాకర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణ… విజిలెన్స్, మీడియా, పోలీస్, రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులపై దాడులు చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే తక్షణం చింతమనేని ప్రభాకర్నీ అరెస్ట్ చేయించి, అతని ఆగడాలపై, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామకృష్ణ.