THE BULLET NEWS (GUNTUR) -ఒక మంచి స్వచ్చమైన రాజకీయ నాయకుడు ప్రజలకు తన అండ తో పాటుగా దేవుని ఆశీస్సులు కూడా ఉండాలని బలంగా కోరుకుంటాడు . ప్రజలను తన సొంత మనుషులుగా భావించి ఎల్లవేళలా వారి శ్రేయస్సును ఆకాంక్షించే నాయకుడు , నరసరావుపేట ఎమెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు .

ఎమ్మెల్యే గా ప్రమాణం చేసిన తొలి రోజు నుండే నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి ప్రతి సమస్యలో తోడుగా ఉంటూ , నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరావుతూ ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు .

అయితే తను ఎమ్మెల్యేగా ఎంత చురుగ్గా పని చేసినప్పటికీ ప్రజలకు మరింత మేలు జరగాలి అని భావించే శ్రీనివాస రెడ్డి గారు . ఆ బ్రహ్మాండ నాయకుడు , ఆపద మొక్కులవాడు, తిరుమలేశుని దర్శనం కోసం ఈ నెల 21న వందలాది మంది కార్యకర్తలు తోడు రాగా పాదయాత్రగా కొండకు బయలుదేరుతున్నారు . చంద్రబాబు పరిపాలనలో దిగజారిన రాజకీయ విలువలు , అధికమైన ప్రజల కష్టాలు తొలిగి పోవాలంటే ఒక మంచి ప్రజా పాలన రావాలని . ముఖ్యంగా చంద్రబాబు హామీలతో గొప్పగా మోసపోయిన రైతులకు యువతకు అధికమైన మేలు జరగాలంటే వైఎస్ జగన్ గారి పాలనతోనే సాధ్యమని భావించి

ఈ మంచి పనులకు ఆ శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులు కోరుతూ దాదాపు 390 కిలోమీటర్లు పాదయాత్ర గా వెళ్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని నియోజకవర్గ ప్రజలకు , నాయకులకు పిలుపునిచ్చారు .

SHARE