వెంక‌ట‌గిరిలో కేఆర్ పి ఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ గా క్రీడా పోటీలు ప్రారంభం

82

Thebullet news (Venkata Giri)-  సంక్రాంతి వ‌స్తుందంటే.. యువ‌త‌, క్రీడాకారులకు గుర్తొచ్చే ఒకే ఒక ఆట‌ క్రికెట్.. ఈ పేరుకు. ఆట‌కు ఫిదా అవ్వ‌ని యువ‌తే ఉండ‌రేమో.. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని వారికి ఓ వేదిక‌ను రూపొందించాల‌నుకున్నారు కేఆర్ పీఆర్ ట్ర‌స్ట్ ( క‌లిమిలి రామ‌ప్ర‌సాద్ రెడ్డి చారిట‌బుల్ ) అధినేత క‌లిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి.. వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణ‌ యువ‌త కోరిక మేర‌కు వార్డు లెవల్ క్రికెట్ పోటీల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్దం చేశారు.. విశ్వ‌దోయ క‌ళాశాల మైదానంలో ఎనిమిది రోజుల‌పాటు ఈ క్రీడాపోటీలు జ‌ర‌గ‌నున్నాయి.. ఈ పోటీల‌ను ఇవాళ ట్ర‌స్ట్ అధినేత‌ కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, సాయికృష్ణ యాచెంద్ర ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ట్ర‌స్ట్ అధినేత క‌లిమిలి రామ్ ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ వెంక‌ట‌గిరి ప‌ట్ట‌ణంలోని 25 వార్డుల నుంచి 25 జ‌ట్లులు పోటీలో పాల్గొంటున్నాయ‌న్నారు.. ప్ర‌త ఒక్క‌రూ క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించి చ‌క్క‌టి ఆట‌తీరును క‌న‌బ‌ర‌చాల‌ని ఆయ‌న కోరారు.. సాయికృష్ణ‌ యాచేంద్ర మాట్లాడుతూ క‌లిమిలి యువ‌సేన ఆధ్వ‌ర్యంలో క్రీడాపోటీలు నిర్వహించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నేత‌లు పాల్గొన్నారు..

SHARE