రైతు ర‌థంపై ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ర‌థ‌సార‌ధి ఆనం

152

THE BULLET NEWS (ATKMAKUR)-రైతులే దేశానికి వెన్నుముక‌ని మాజీ మంత్రి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి అన్నారు.. అనంత‌సాగ‌ర మండ‌లంలో ఇవాళ రైతు ర‌థం ట్రాక్ట‌ర్ల‌ను ఆయ‌న పంపిణీ చేశారు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతుల గురించి నిరంత‌రం అలోచించే చంద్ర‌బాబు నాయ‌డు ముఖ్య‌మంత్రిగా దొర‌క‌డం ఏపీ రాష్ట ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌న్నారు.. ఆత్మ‌కూరును మ‌రింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.. అంత‌కుముందు మండలపరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినంలో పాల్గొన్న ఆయ‌న స్థానికుల నుంచి విజ్ణ‌ప్తులు స్వీక‌రించారు.. కొన్నింటికి అక్కడిక్క‌డే ప‌రిష్కారం చూపారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక టీడీపీ నాయ‌కులు భారీగా పాల్గొన్నారు..

SHARE