గిరిజన మహిళపై ఆత్మకూరు ఖాకీల ప్రతాపం..

223

THE BULLET NEWS (ATMAKUR)-నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు రెచ్చపోయారు.. స్టేషనుకు పిలిపించి మరీ ఓ మహిళను చితక్కొట్టారు.పట్టణంలోని ఎస్టీ కాలినీకి చెందిన రాగి ప్రసన్న అనే మహిళ భర్త మద్యానికి బానిసయి తరచు తనను వేదిస్తూ ఉండటంతో భర్తకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తుంది.ఈ క్రమంలో గత ఏడాది ప్రసన్నకు స్థానికంగా ఉన్న హరికృష్ణ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకొని కలిసి ఉంటున్నారు.ఈ రోజు ఉదయం ప్రసన్నను పోలీసులు స్టేషనుకు పిలిపించారు.బాదితురాలి కధనం ప్రకారం..హరికృష్ణ కుటుంబ సభ్యులు నీ పైన పిర్యాదు చేశారని.వెంటనే నువ్వు హరికృష్ణను వదిలేయాని పోలీసులు సూచించారు.అంతటితో ఆగకుండా అసభ్యకరమైన పదజాలతో ప్రసన్నను తిడుతూ లాటిలతో చితకొట్టి తనతో భలవంతంగా సంతకం చేయించారని ప్రసన్న ఆరోపిస్తుంది.గాయాల పాలైన ప్రసన్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుంది.

SHARE