అసంతృప్తిలో కన్నబాబు వర్గం.. అధిష్టానం పై గుర్రుగా కేడర్…

629

THE BULLET NEWS (ATMAKUR)-దిక్కు మొక్కు లేని పార్టీ దిశా నిర్దేశం చేశారు.. ఎవ్వరు లేని చోటా అన్ని తానై నడిపించారు.. ప్రజా
ప్రస్థానంలో ఒంటరిగా పోరాడి ఓడినా పార్టీ ప్రతిష్టను నిలబెట్టారు.. అలాంటి నేత భవిత్యం పై అనుచరుల
మదిలో మెదులుతున్న ఆందోళనేంటి..? అధిష్ఠానం మీద కేడరుకున్న అసంతృప్తికి కారణాలేంటి..? సేవలను
పార్టీ గుర్తుంచకపోవటం పట్ల ఆ నేతేమంటున్నారు..? ఇంతకీ ఎవరా నేత..? ఏంటా కథ..? ఇవాళ్టి హాట్ టాపిక్

గూటూరు కన్నబాబు.. ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపికి ఒకప్పటి పెద్ద దిక్కు..
దాదాపు పదేళ్ల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి కి బలమైన నాయకుడే లేరు.. 2014 దాకా అదే
పరిస్థితి.. అలాంటి టైమ్ లో నేనున్నానంటూ పార్టీ బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నారు
కన్నబాబు.. ఎక్కడో జీరోలో ఉన్న పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకొచ్చారు.. నిస్తేజంలో ఉన్న కేడర్
లో ఉత్సాహన్నీ నింపుతూ విస్తృతంగా ప్రజల్లో తిరిగారు.. 2014లో ఉన్న పరిస్థితుల ద్రుష్ట్యా జగన్ చరిష్మా
ముందు నిలువలేకపోయారు..

సీన్ కట్ చేస్తే…

పార్టీ అధికారంలోకి రావటంతో కన్నబాబుకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లైంది.. అభివ్రుద్ది పనులు
వేగవంతం చేస్తూ బలం పుంజుకునే సమయంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైకిల్ ఎక్కారు..
దీంతో కన్నబాబును పక్కనపెట్టి నియోజకవర్గ బాధ్యతలు ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించారు..దింతో
దీంతో అప్పటి నుంచి కన్నబాబుకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.. అయినా కన్నబాబు మాత్రం ఏమాత్రం
నిరుత్సాహ పడకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు.. స్వతహాగా కన్నబాబుకు కు ఎఎస్
పేట, కరటంపాడు, అనంతసాగరం, వంటి మండలాల్లో బలమైన అనుచర గణముంది.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కన్నబాబు కి ఏదో ఒక నామినేటెడ్ పదవి కట్టబెట్టి ఆయన అనుచరులను సంతృప్తి పరచాలనే ఆలోచనలో చంద్రబాబు ఉండగా కన్నబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటిదాకా తనను, తన వర్గాన్ని ఇబ్బంది పెడుతూ వచ్చిన ఆనంతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కన్నబాబు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట.. రాజకీయంగా ఎదగాలని తాను చూస్తుంటే పదవులు కట్టబెట్టి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చెయ్యాలని అధిష్టానం చూడటం బాధేస్తుందని ఆయన వాపోతున్నారట.. ఎన్నికల హడావిడి మొదలవుతున్న తరుణంలో ఆనం సైతం తనని దగ్గర చేసుకునేందుకు ట్రై చేస్తున్నారని ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కన్నబాబు తన అనుచరులతో అంటున్నారట.. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి అయినా ఓట్లు చీల్చి ఆనం రామనారాయణ రెడ్డి దెబ్బగొట్టాలని ఆయన అనుచరులు ఒత్తిడి తీస్తున్నట్లు ఆత్మకూరు టౌన్ టాక్…
ఏదేమైనా కన్నబాబుని బుజ్జగించకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు బలంగా ఉన్నాయి…

SHARE