ఆత్మకూరు రాజకీయం… హాట్ టాపిక్…

264

THE BULLET NEWS (ATMAKUR):-నిన్నమొన్నటి వరకు పాలిటిక్స్ లో సైలెంట్ గా ఉన్న ఆ నేత సడన్ ఎంట్రీ కి కారణమేంటి..? ఎవరికి చెక్ పెట్టేందుకు ఆ మాజీ ఎమ్మెల్యేని రంగంలోకి దింపారు.. మాజీ ఎమ్మెల్యే రాకతో ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..? ఆ ఇద్దరూ కలిస్తే పార్టీ స్ట్రాంగ్ అవుతుందా..? ఇంతకీ అసలు ఆత్మకూరులో ఎం జరుగుతోంది..?

ఆత్మకూరు అధికార పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని క్రిష్ణయ్య మళ్ళీ తెరమీదకొచ్చారు.. దానికి తోడు మరో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు కూడా టిడిపికి టచ్ లో ఉండటంతో ఆయానకుడా రేపో మాపో టిడిపి పంచన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వచ్చే ఎన్నికల సమయానికి టిడిపిలో చేరాలనే ఆలోచనలో కొమ్మి ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు..
ఈ వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడితే.. ఆత్మకూరు ఇంచార్జ్ బాధ్యత కోసం తిరుగుబాటు బావుటా ఎగరేసిన కన్నబాబుకు చెక్ పెట్టేందుకే బొల్లినేనిని మాజీ మంత్రి ఆదాల తెరమీదకు తెచ్చారని కన్నబాబు అనుచరులు చర్చించుకుంటున్నారు.. తనకే ఆత్మకూరు ఇంచార్జ్ బాధ్యత ఇవ్వాలంటూ కన్నబాబు జిల్లా పార్టీ కార్యాలయంలో నానా యాగి చేశారు.. పరోక్షంగా ఆధాలను. మంత్రి నారాయణ టార్గెట్ చేసుకుని విమర్శలు సైతం గుప్పించారు.. దీనితో కన్నబాబు కు ఎలాగైనా చెక్ పెట్టాలని ఆదాల భావించారట.. దానికి తోడు కన్నబాబు కు వచ్చే ఎన్నికల్లో టికెట్ తీస్తే గెలిచే అవకాశాలు లేవని పార్టీ చేస్తున్న అంతర్గత సర్వేలు సైతం చెబుతున్నాయట.. దీనితో తాత్కాలిక ఇంచార్జి గా ఉన్న ఆదాల పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టి బొల్లినేని ని రంగం లోకి దించారని తెలుస్తుంది.. ఇప్పటికే ఒక దఫా బొల్లినేని ని సీఎం వద్దకు సైతం తీసుకెళ్లారట.. ఆయనకి సీటు హామీ ఇవ్వడంతోనే మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది.. మొత్తంగా చూసుకుంటే మాజీ మంత్రి ఆదాల వ్యూహం ఆత్మకూరులో ఫలించినట్టుంది..మరోపక్క కొమ్మి, బొల్లినేని రాకతో టిడిపి స్ట్రాంగ్ అయినట్టే కనిపిస్తుంది.. ఆత్మకూరు తో పాటు ఉదయగిరి, వెంకటగిరిలో కూడా వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.. వీళ్లకు ఉండే బంధువర్గం, క్లియర్ ఇమేజ్ కూడా టిడిపికి లాభిస్తుంది

SHARE