గూడూరు ఆదిశంకరలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

2048

THE BULLET NEWS (GUDUR)-నెల్లూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
చదువుతున్న కాలేజ్ హాస్టల్ లో ఉరివేసుకుని తనువు చాలించింది. గూడూరు ఆదిశంకర కళాశాల హాస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీకాళహస్తి ప్రాంతంలోని మడమల గ్రామానికి చెందిన మాధవి సివిల్ ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతోంది. 2000 ఏడాది జన్మించిన మాధవికి 18 సంవత్సరాలు.
2017 న గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాలలో జాయిన్ అయ్యింది. మొదటి ఏడాది కూడా చదువు పూర్తి కాక ముందే బాత్ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవలే హాస్టల్ గదిలో ఫోన్ ఒకటి చోరీకి గురైంది. ఆ సెల్ ఫోన్ మాధవి తీసిందంటూ సహచర విద్యార్థినిలు నిందించారు. అయితే ఆ ఫోన్ తాను తీయలేదని తల్లిదండ్రుల వద్ద మాధవి మొర పెట్టుకుంది. తల్లిదండ్రులు కూడా హాస్టల్ కు వచ్చి మాదవికి నచ్చజెప్పారు. ఇదే కారణం తో మాధవి మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కుటుంభ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మించి మాకు తెలిసిన కారణాలు ఏమీ లేవని వారంటున్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.

SHARE