The bullet news ( Gudur)_ భరత మాతను ప్రేమిద్దాం.. తల్లిని ప్రేమిద్దాం.. గురువులను పూజిద్దాం.. భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుదాం.. ప్రేమికుల దినోత్సవాన్ని బ్యాన్ చేద్దామంటూ గూడూరు లో ఎబివిపి నాయకులు ఆందోళన నిర్వహించారు.. స్థానిక క్లాక్ టవర్ సెంటర్ లో వాలెంటైన్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రేమికుల రోజును బహిష్కరిద్దాం – మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాదాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. ఎబివిపి జిల్లా కన్వీనర్ మనోజ్ మాట్లాడుతూ విదేశీ సంస్కృతికి యువత దూరంగా ఉండాలన్నారు.. పరాయి స్త్రీని వ్యామోహంతో ప్రేమించిన వాలెంటైన్ కి గుర్తు గా మన దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోవడం దారుణమన్నారు.. పరాయి స్త్రీని తల్లిగా చూడటం మన దేశ సాంప్రదాయం అన్నారు.. అందరూ వాలెంటైన్స్ డే కి దూరం గా ఉండాలని మనోజ్ పిలుపునిచ్చారు.

SHARE