ఘనంగా అయ్యప్ప పడిపూజ

146

THE BULLET NEWS (MACHILIPATNAM)-కృష్ణ జిల్లా మచిలీపట్నం లో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఎప్పటిలాగే దీక్ష చేస్తున్న అయ్యప్ప భక్తులు మండల దీక్ష పూర్తి చేసుకుని ఈరోజు పడి పూజ నిర్వహిస్తున్నారు.
అయ్యప్ప పూజలో అతి ముఖ్యమైన ఘట్టం పడిపూజ. మెట్టు మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ 18మెట్లను పూజించే ఈ పవిత్ర ఘట్టం చూడటానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. పడిపూజ చూడాలనే సంకల్పంతోటే అయ్యప్ప భక్తులు శబరి యాత్ర చేస్తుంటారు. దాదాపు 45నిముషాలసేపు ఈ పడిపూజ జరుగుతుంది. ఈ పవిత్రమైన ఘట్టాన్ని చూడటానికి ఐదువేలకు పైగా భక్త్తులు తరలివచ్చారు.

SHARE