బాబాయ్ స్పీచ్‌కి అబ్బాయి ఫిదా..

115

The bullet news(ramcharen)-   ప్రసంగం అద్భుతంగా ఉందంటూ బాబాయ్ పవన్ కళ్యాణ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు అబ్బాయ్ రాంచరణ్. గుంటూరు జిల్లా మంగళగిరి కాజా సమీపంలోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ఎండగడుతూ పవన్ చేసిన ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకుంది. పవన్ చేసిన ప్రసంగంపై ఓ పక్క టీడీపీ ఫైర్ అవుతుంటే.. బాబాయ్ స్పీచ్ సూపర్ అంటూ రాం చరణ్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ‘రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం ఎదురు చూద్దాం.. అందరికీ స్ఫూర్తినిచ్చేలా, నిజాయితీగా చాలా గొప్పగా ఉంది బాబాయ్ స్పీచ్’ అంటూ రాం చరణ్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. చరణ్‌‌తో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ కూడా పవన్‌ని చేగువేరాతో పోల్చుతూ ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

SHARE