బాబూ.. ఆర్ధికంగా వెనుకబడిన బీసీలను ఆదుకో – సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్య‌క్షులు ఉల్లిపాయ‌ల శంక‌ర‌య్య

79

The bullet news (Nellore)- రాజ్యంగ స‌వ‌ర‌ణ చేసైనా స‌రే చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీల‌కు దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్య‌క్షులు ఉల్లిపాయ‌ల శంక‌ర‌య్య డిమాండ్ చేశారు.. నెల్లూరు న‌గ‌రంలోని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాల‌యంలో ఇవాళ జిల్లా కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది.. ఈ సమావేశానికి రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న రాష్ట వ్యాప్తంగా బీసీలు ఆర్దికంగా, సామాజకంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నందున చట్టసభల్లో బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీల పురోగతి సాధ్యమవుతుందన్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిన బీసీి రిజర్వేషన్ బిల్లు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.. బీసీలపై శీతకన్ను ప్రదర్శించడం తగదన్నారు.. బీసీలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నా చంద్రబాబు నాయు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.. బీసీీల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు బీసీలను మరిచిపోవడం దారుణంగా ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ నాయ‌కులు పాల్గొన్నారు.

SHARE