పొదలకూరు మండలంలో భగ్గుమన్న పాత కక్షలు —యువకునికి కత్తిపోట్లు…

107

పొదలకూరు మండల కేంద్రంలోని పొదలకూరు పట్టణంలో మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో పాత కక్షల నేపథ్యంలో బ్లాక్ కలర్ షిఫ్ట్ కారులో వచ్చిన దుండగులు పొదలకూరు లోని వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న పుల్లపుత్తూరు శివ అనే వ్యక్తిని రాంనగర్ గేట్ సెంటర్ నందు అకస్మాత్తుగా కారులోంచి దిగి కత్తితో పొడవడం తో కడుపులో కత్తిదూసుకొని పోగా చేతికి తీవ్రగాయాలయ్యాయి.ఆ పని కూడా ఉన్న ప్రదీప్ అనే స్నేహితులకి చేతికి తీవ్ర గాయమైంది.విషయం తెలుసుకున్న పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గంగాధర్ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి నెల్లూరు డి ఎస్ ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కి అంబులెన్స్లో తరలించారు.అప్పటికే సి ఐ గారు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో నెల్లూరు సమీపంలో ఉన్న కొత్తూరు ఏరియాలో వాహన వెళుతున్నట్లు సమాచారం తెలుసుకొని హుటా హుటిన బయలుదేరి వెళ్లారు.పూర్తి విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.