కుర్రకారు మతులు పోగొట్టిన ముద్దుగుమ్మలు..

150

The bullet news (Nellore)- నెల్లూరు లో అందాల భామలు రాశీఖన్నా,మెహ్రీన్ లు సందడి చేశారు.. చిరకట్టుతో యువతను ఆకట్టుకున్నారు..నగరంలోని గాంధీబొమ్మ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎల్ఎం షాపింగ్ మాల్ ఈ ముద్దుగుమ్మల చేతులమీదుగా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ అందాభామలను చూసేందుకు పెద్ద ఎత్తున యువత ఎగబడ్డారు.. దీంతో గాంధీబొమ్మ సెంటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది..జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్ర
ప్రపంచాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా రాశిఖన్నా మాట్లాడుతూ కే ఎల్ ఎం షాపింగ్ మాల్ తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.. తాను తమిళ్ లో మూడు సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.. మరో భామ మెహ్రీన్ మాట్లాడుతూ రెండో సారి నెల్లూరుకి రావడం ఆనందంగా ఉందన్నారు.. సింహపూరియుల అభిరుచికి తగ్గట్టు కే ఎల్ ఎం లో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు మెహ్రీన్ తెలిపారు…

SHARE