వైభవంగా ప్రారంభమైన గొలగముడి వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు..

246

THE BULLET NEWS (GOLAGAMUDI)-దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్దమైన పుణ్యక్షేత్రల్లో నెల్లూరుజిల్లా వెంచటాచలం మండలంలో వెలసియున్న గొలగమూడి పుణ్యక్షేత్రం ఒకటి.. భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వెంకస్వామి 36వ ఆరాధనోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.. దాదాపు వారంపాటు జరగనున్న ఈ ఆరాదనోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి గాక ఇతర రాష్టాల నుంచి కూడా వస్తుంటారు.. ఈ ఉత్సవాలకు దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు..

ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు మన రాష్ట్రంతోపాటు, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటకా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. భక్తులు సేద తీరేందుకు వసతి గృహాలు, కల్యాణ మండపాలు, డార్మెటరీలు సిద్ధం చేశారు అధికారులు. తెప్పోత్సవానికి కోనేరు కూడా ముస్తాబైంది. ఉత్సవాలు జరిగే ఏడు రోజులు అన్నదానం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం, రాత్రి ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం వేకువన గోపూజ, అభిషేక పూజలు, ఉదయం 10 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 9గంటలకు కల్పవృక్ష వాహన సేవ గ్రామోత్సవం జరగనుంది.

SHARE