ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలి – వెంకటాచలం మండల టీడీపీ నాయకులు కొణిదేన వెంకటకిష్ణమనాయుడు

147

The bullet news (Venkatachalam)- తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు స్వర్గీయ ఎన్టీయారని వెంకటాచలం మండల జన్మభూమి కమిటీ సభ్యులు కొణిదేన వెంకటకిష్ణమనాయుడు అన్నారు.. ఎన్టీయార్ వర్దంతి కార్యక్రమాన్ని మండలంలోని పుంజులూరులో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అంగన్వాడీ విద్యార్దులకు పలకలు అందజేశారు.. కొణిదేన వెంకటకిష్ణమనాయుడు మాట్లాడుతూ ఎన్టీయార్ కారణజన్ముడన్నారు.. భారతప్రభుత్వం ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలప్రజలకు రాజ్యాధికారం అందించిన మహానుభావుడు ఎన్టీయారని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో నాయకులు చక్రధర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు..

SHARE