బైక్- ఐస్ క్రీమ్ ఆటో డీ.. ఇద్దరు మృతి

256

The Bullet News ( Muthukuru)-నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం తెల్ల దొరువు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈసంఘటనలో స్కూటర్ పై వెళ్లుతున్న మస్తాన్, ప్రకాష్ అనే యువకులు ప్రమాద స్ధలంలోనే మృతిచెందారు. వివరాలోకి వెళ్లితే వెంకటాచలం మండలం నిడుగుంటపాళెం దర్భలమిట్టకు చెందిన యువకులు ఇతర పని నిమిత్తం ఇంటి వద్ద నుంచి కప్పలదొరువైపు వెళ్లుతున్నారు. అటువైపునుంచి ఐస్ క్రీమ్ ఆటో అతివేగంగా వచ్చి స్కూటర్ ను డీకొనడం జరిగింది. దింతో స్కూటర్ పై వున్న వారు మృతిచెందారు. ఆటో డ్రైవర్ ఆటోను వదలి  పరార్ అయ్యాడు. పోలీసులు సంఘటనాస్ధలాన్ని చేరుకొని మృతదేహాలను పంచనామనిమిత్తం  నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

SHARE