బైక్ ఢీకొని దుప్పి మృతి

96

The bullet news ( Venkatagiri) _ వేగంగా వస్తున్న మోటార్ బైక్ ఢీకొని ఓ దుప్పి మృత్యువాత పడగా, వాహనదారుడు గాయపడ్డ ఘటన నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం రాపూరు రోడ్డు, తొమ్మిదవ మైలురాయి వద్ద ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.. చాగణం రాజుపాళానికి చెందిన శ్రీనివాస రాజు మోటర్ బైక్ పై రాపూరు రోడ్డు వైపు వెళుతున్నాడు.. ఇదే సమయంలో అడవిలో నుంచి దుప్పి పరుగెత్తుకుంటూ రోడ్డు దాటుతున్నది.. దింతో అటుగా వస్తున్న బైక్ డీ కొట్టింది.. ఈ ఘటనలో దుప్పి అక్కడిక్కడే ప్రాణాలు వదలగా, వాహనచోదకుడు శ్రీనివాస రాజుకు తీవ్ర గాయాల య్యాయి.భాదితుడిని 108 వాహనం ద్వారా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.. మృతువాత పడ్డ దుప్పిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

SHARE