కాపుల‌ను బీసీల్లో చేర్చ‌డంపై నెల్లూరులో భ‌గ్గుమ‌న్న బీసీ సంఘాలు

72

The bullet news (Nellore)_ కాపులను బీసీల్లో చేర్చడంపై నెల్లూరులో బీసీ సంఘ నాయకులు ఆందోళన నిర్వహించారు. నగరంలోని పూలేబొమ్మ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రోడ్డు పై బైఠాయించి త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.. దీంతో ట్రాపిక్ స్థంభించింది. రంగ ప్ర‌వేశం చేసిన పోలీసులు బీసీ సంఘ నాయ‌కుల్ని అరెస్టు చేసేందుకు య‌త్నించ‌డంతో అక్క‌డ కాస్త ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.. రాజకీయ లబ్ది కోసమే కాపులను బీసీల్లో చేర్చి తమను చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సంపత్ మండిపడ్డారు.. వచ్చె ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం చెప్పేందుకు బీసీలందరూ సిద్దంగా ఉన్నామన్నారు..

SHARE