పార్టీ మారితే రూ. 30 కోట్లు ఇస్తామన్నారు..

209

The bullet news (POLITICAL)-

పార్టీ మారితే తనకు రూ. 30 కోట్లు, కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తామని బీజేపీ నాయకులు ప్రలోభపెట్టారని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావి గ్రామీణ నియోజకవర్గం నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న ఆమె పలు విషయాలను మీడియా ముందు బయటపెట్టారు. బీజేపీ నాయకులు తనతో ఫోన్ లో జరిపిన సంభాషణలు రికార్డు చేసి, ఆపరేషన్ కమలం గురించి హోం మంత్రి పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్‌ కమలం చేపట్టడం అనైతికమని, వారిచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్నారు. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా, మరోవైపు త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఆరోపిస్తుందని గుసగుసలాడుకుంటున్నారు.

SHARE