ర‌క్త‌మోడిన ర‌హ‌దారి- కారుబోల్తా- ఇద్ద‌రు మృతి, న‌లుగురికి తీవ్ర‌గాయాలు

83

The bullet news (Atmakur)- వేణుగోపాల్ రెడ్డి (45), బాబి (40)గా గుర్తించారు.. బుచ్చిరెడ్డిపాలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి బాబి, వంశీకుమార్, నిఖిలేష్‌, స‌త్య‌నారాయ‌ణ‌, మ‌స్తాన్ కారులో క‌డ‌ప‌కు బ‌య‌ల్దేరారు.. క‌దిరినాయుడుప‌ల్లి స‌మీపంలోకి రాగానే వేగాన్ని అదుపు చేయ‌లేక కారుబోల్తా కొట్టింది.. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతిచెంద‌గా వంశీకుమార్ అత‌ని కొడుకు నిఖిలేష్, .స‌త్య‌నారాయ‌ణ‌; మ‌స్తాన్ లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.. హుటాహుటిన వారిని ఆత్మ‌కూరు కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్తితి కూడా విష‌మంగా ఉంద‌ని తెలుస్తోంది.. మ‌రో్ ప‌క్క క్ష‌త‌గాత్రుల‌ను మొద‌ట‌ ఆత్మ‌కూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిచడంతో వారికి హుటాహుటిన ప్ర‌యివేట్ వైద్య‌శాల‌కు త‌ర‌లించారు…

SHARE