రూ. 57 కోట్లు దాచిపెట్టిన బీఎంఆర్ గ్రూప్…

75

The bullet news (IT EFFECT)- తాజాగా జరిగిన ఐటీ సోదాల్లో బీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ. 57 కోట్ల ఆదాయాన్ని లెక్కలు చూపనట్టుగా గుర్తించారు అధికారులు… బుధవారం ప్రారంభమైన ఐటీ సోదాలు శుక్రవారం వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో 57 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు అధికారులు… బీఎంఆర్ గ్రూప్‌ కూడా దీనిని అంగీకరించి, వాయిదాలలో పన్ను చెల్లించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. బీఎంఆర్ గ్రూప్‌… నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌రావుకు చెందినది… ఆక్వా ఉత్పత్తులు చేయడం, వాటిని ఎగుతమి చేయడం చేస్తుంటారు. చెన్నైలో బీఎంఆర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. ఏపీలోనూ బీద మస్తాన్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

SHARE