బొమ్మిరెడ్డి.. రాజీనామాకు సిద్ద‌మా – టీడీపీ నాయ‌కుల ప్రశ్న‌

150

The bullet news (Dakkili)- వెంక‌టగిరి నియోజ‌క‌వ‌ర్గ సమన్వయకర్త, జెడ్పి ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రెండు రోజుల క్రితం చేసిన స‌వాల్ ఇప్పుడు అధికార‌, ప్ర‌తిప‌క్ష‌ల మ‌ద్య వాట‌ర్ వార్ కు దారితీసింది. తెలుగుగంగ కాలువలో పనులు జరుతున్నట్టు నిరూపిస్తే తాను జెడ్పి ఛైర్మెన్ పదవికి రాజీనామా చేస్తానన్న జ‌డ్పీ చైర్మ‌న్ స‌వాల్ ను టీడీపీ నాయ‌కులు స్వీక‌రించారు.. జ‌డ్పీ చైర్మ‌న్ ను రివ‌ర్స్ కౌంట‌రేశారు.. ఇవాళ డక్కిలి మండలంలో జరుగుతున్న తెలుగుగంగ కాలువ పనులను వెంకటగిరి ఎఎమ్ సి చైర్మన్ రాజేశ్వరరావు, డక్కిలి జ‌డ్పీటీసీ రామచంద్రనాయుడు ,డక్కిలి పార్టీ అధ్యక్షుడు కోటేశ్వర రెడ్డి, వెంక‌ట‌గిరి టీడీపీ నాయ‌కులు దొంతు బాల‌కృష్ణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు.. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు బొమ్మిరెడ్డిపై మండిప‌డ్డారు.. డక్కిలి మండలంలో తెలుగుగంగ కాలువ పనులు జరుగుతున్నాయని, అందువ‌ల్లే కండలేరు జలాశయం నుండి సాగునీరు కింద‌కు వ‌ద‌ల‌డం లేద‌ని, డ‌క్కిలి మండ‌లానికి వ‌స్తే ప‌నులు జరుగుతున్నాయో లేదో చూపిస్తామంటూ వారు స‌వాల్ విసిరారు.. మాట మీద నిల‌బ‌డి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు..

SHARE