నిరుపేద విద్యార్థికి అండగా కావ్య కృష్ణా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్…

170

THE BULLET NEWS (UDAYAGIRI)-ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తే నిరుపేద విద్యార్దులు ఉన్నత శిఖరాలుకు చేరుకుంటారనేది ఆయన నమ్మకం.. ఆలోచనలు రావడమే ఆలస్యం.. తన స్వంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్దులకు యూనిఫామ్స్, పుస్తకాలుస్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసేందుకు సిద్దమవుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వాలంటీర్లును సైతం నియమించారు.. ఆయనే.. దగుమాటి వెంకట కిష్ణారెడ్డి.. కావ్య కిష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్దులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసేందుకు ఆయన నడుం బిగించారు.. వాటితో పాటు తన స్వంత నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు సైతం కల్పిస్తానని ఆయన చెబుతున్నారు. ఈనెల 17న బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు..

SHARE