వంచనకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు -ఎమ్మెల్యే కాకాణి కామెంట్

198

The bullet news (Nellore)- అబద్దాలు, మోసాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారని నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీకి ఓటేసి తప్పు చేశామని భావన ప్రజల్లో కనిపిస్తుందన్నారు.. నవనిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిపై ప్రజలకు విశ్వాసం లేకపోవడం వల్లే నవనిర్మాణదీక్షలు వెలవెలబోతున్నాయని ఆయన విమర్శించారు.. జగన్ పోరాటాల వల్లే ప్రత్యేకహోదా సజీవంగా ఉందన్నారు.. ఆంద్రుల వంచన వారధికి చంద్రబాబు నాయకుడంటూ ఆయన ఎద్దేవా చేశారు..

SHARE