THE BULLET NEWS (GUDUR)-నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొండాగుంట సమీపంలో కాసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఇటుకల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలవ్వగా.. మరొకరికి గాయాలయ్యాయి.. ఇద్దరు ప్రాణ భయంతో పరుగులు తీశారు..

శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబెడు గ్రామానికి చెందిన 5 మంది ఇటుకల లోడుతో గూడూరులోని హౌస్ ఫర్ ఆల్ ఇళ్లకు ఈ రోజు ఉదయం బయలుదేరారు. గూడూరు రూరల్ మండలం వెంకటేసుపల్లి మలుపు వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ బోల్తా పడింది. ఇటుకలపై కూర్చొని ఉన్న సురేష్, వెంకటకృష్ణయ్య మృతి చెందారు. గాయపడిన పుల్లయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరు ఎస్ ఐ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు

SHARE