పసుపు కుంభకోణంలో బ్రూస్లీదే కీ రోల్.. – కాకాణి విమర్శ

115

The Bullet News ( Kaligiri ) _ఉదయగిరి నియోజకవర్గం పసుపు రైతులు పొట్టగొట్టి భారీ కుంభకోణానికి టీడీపీ నాయకులు పాల్పడటంలో వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదే కీలక పాత్రని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు.. కలిగిరి మండల కార్యకర్తల సమావేశంలో ఎంపీ మేకపాటితో కలిసి పాల్గొన్న ఆయన తనదైన శైలిలో మంత్రి సోమిరెడ్డిపై మండిపడ్డారు.. మంత్రి సోమిరెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ముద్దుగా బ్రూస్లీ అని పిలుస్తుంటారని అవినీతే ఆయన ట్రాక్ రికార్డని  విమర్శించారు.. ఎక్కడి నుంచో పసుపు తీసుకొచ్చిన తెలుగు తమ్ముళ్లు అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షించాల్సింది పోయి వారికి స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు మంత్రి అండగా నిలబడటం సిగ్గు చేపట్టాన్నారు.. సోమిరెడ్డి జీవితమంతా అవినీతి అక్రమాలేనని తీవ్ర వమర్శలు చేశారు. రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన నీచమైన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదన్నారు.. తమ పార్టీ వారిమీద కేసులు పెట్టొద్దంటూ పోలీస్ అధికారులను మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తూ అవినీతికి కొమ్ముకాస్తున్నారన్నారు.. వైఎస్సార్ హయాంలోనే రైతులు స్వర్ణయుగం చూశారని, మళ్లీ అలాంటి రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు..

SHARE